Delhi Murder: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కత్తులతో కడుపులో పొడిచి పేగులు బయటకు వచ్చేలా క్రూరత్వం ప్రదర్శించారు. వివరాలలోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పార్క్ పరిసర ప్రాంతంలో హత్యకు సంబంధించిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. యువకుడి పేగులు బయటకు వచ్చేలా దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఆదివారం ఢిల్లీలోని రాజ్ పార్క్ ప్రాంతంలో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. అర్ధరాత్రి 12.23 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని అధికారి తెలిపారు. రాజ్ పార్క్ రాఠీ హాస్పిటల్ స్ట్రీట్ సమీపంలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లు కాల్ వచ్చిందన్నారు. ఈ ఘటనలో బాధితుడి పేగులు బయటకు కనిపించాయి. బాధితుడు హత్రాస్‌లో నివాసముంటున్న వీరేంద్ర సింగ్‌గా అతని ఆధార్ కార్డు సహాయంతో గుర్తించామని పోలీస్ అధికారి తెలిపారు.
సంఘటనా స్థలానికి మొబైల్ క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలను పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవ్వడంతో సంఘటన స్థలంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య ఆశకు సమాచారం అందించారు. హత్యా నేరంపై ఐపీసీ సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి బాధితుడి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
Read More: Covid Cases: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 67 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య