Site icon HashtagU Telugu

Murder : అమ్మమ్మను చంపి…టీవీ చూస్తు కూర్చున్న మనవడు..!!

Chennai

Chennai

చెన్నైలో దారుణం జరిగింది. అమ్మమ్మను చంపి టీవీ చూస్తూ కూర్చున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన తల్లి అప్పుగా తీసుకున్న లక్షరూపాయలు తిరిగి ఇవ్వమని అడిగిన అమ్మమ్మను అతి కిరాతంగా చంపాడు మనవడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రుక్తుడైన మనవడు సుత్తితో అమ్మమ్మను కొట్టాడు. తీవ్రగాయాలతో అరుపులు పెట్టడంతో….శబ్దం బయటకు వినపడకుండా టీవీ సౌండ్ పెట్టాడు. అరుపులు వినిపిస్తున్నాయని ఇరుగుపొరుగువారు అడగటంతో అమ్మమ్మ బయటకు వెళ్లిందని చెప్పి…ఇంట్లో లోపలికి తాళం వేసుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు. తీవ్రగాయాలైన కొద్దిసేపటికే అమ్మమ్మ మరణించింది. జరిగిన విషయం తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో…ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కొరుక్కుపేటలోని కారుమారియమ్మన్ వీధిలో జరిగింది. మ్రుతురాలిని విశాలక్షీగా పోలీసులు గుర్తించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.