Leave Letter: ఓ ఉద్యోగి తన బాస్ కి పంపిన లీవ్ లెటర్ ఇంటర్ నెట్ లో హల్ చల్.. అందులో ఏముందంటే..!

ఏ సంస్థలో అయినా సరే పనిచేసే వాతావరణం బాగుంటే.. ఏ ఉద్యోగి అయినా పూర్తిగా అంకిభావంతో పనిచేస్తాడు.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 12:22 PM IST

ఏ సంస్థలో అయినా సరే పనిచేసే వాతావరణం బాగుంటే.. ఏ ఉద్యోగి అయినా పూర్తిగా అంకిభావంతో పనిచేస్తాడు. అదే సమయంలో బాస్ కూడా తన ఉద్యోగులతో స్నేహంగా ఉంటే.. మంచి అవుట్ పుట్ వస్తుందంటారు. అలాంటప్పుడే ఉద్యోగుల నుంచి పూర్తిగా నిజాయితీతో కూడిన పనిని ఆశించవచ్చు. దీనికి ఉదాహరణ కావాలంటే.. ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్న ఓ సెలవు చీటిని చూస్తే విషయం అర్థమవుతుంది.

ఓ సంస్థ యజమానికి ఆయన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి లీవ్ కావాలంటూ మెయిల్ చేశాడు. ఎందుకు లీవ్ అడుగుతున్నారు అంటూ ఆయన ఆ మెయిల్ ని చదివారు. అందులో ఉన్న మ్యాటర్ ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అదే సమయంలో ఆ ఉద్యోగి నిజాయితీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇదంతా ఎందుకంటే..ఆ సెలవు చీటిలో ఉన్న మ్యాటరే దానికి కారణం.

తన జూనియర్లు నిజంగా చాలా మంచివారని.. అందుకే వేరే సంస్థలో ఇంటర్వ్యూకు అటెండ్ కావడం కోసం లీవ్ కావాలని మెయిల్ చేశారన్నారు ఆ బాస్. పైగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని కూడా ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్లంతా ఆ ఉద్యోగి నిజాయితీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పైగా ఉద్యోగి హానెస్టీని.. అంతే నిజాయితీతో ట్వీట్ చేసిన బాస్ ని కూడా పొగుడుతున్నారు.

ఆ లీవ్ లెటర్ లో ఏముందంటే.. బాస్ కి గుడ్ మార్నింగ్ చెబుతూ.. తనకు వేరే కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని.. దానికి హాజరు కావడానికి సెలవు కావాలని.. అందుకే దయచేసి లీవ్ ఇవ్వాలని మనసారా కోరుకున్నాడు. ఆ లీవ్ లెటర్ చదివిన నెటిజన్లు.. అబ్బా.. అలా నిజాయితీతో అసలు కారణం రాసేంత స్వేచ్ఛ ఉన్న సంస్థను, ఆ బాస్ ని అభినందిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగి నిజాయితీకి మంచి మార్కులేస్తున్నారు. అందుకే లైక్ లు, రీ ట్వీట్ లతో ఆ పోస్టును నెట్ లో హోరెత్తిస్తున్నారు.