Site icon HashtagU Telugu

Delhi Rape: బాలిక అత్యాచార వీడియో తీసి బాలిక తండ్రికి పంపిన నిందితుడి కొడుకు

Rape Imresizer

Rape Imresizer

Delhi Rape: దేశ రాజధాని ఢిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటనను వృద్ధుడి కుమారుడు వీడియో తీశాడు. అదే వీడియోని బాధితురాలి తండ్రికి పంపించాడు. వివరాలలోకి వెళితే…

బాధితురాలు తన ఇంటి బయట కూర్చున్నప్పుడు ఆమెను ప్రలోభపెట్టి 68 వృద్ధుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 20 నుంచి 30వ తేదీ మధ్య జరిగిందని పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటన ఎవరికీ చెప్పవద్దని బాలికను వృద్ధుడు బెదిరించాడు. దాంతో బాలిక ఎవరికీ చెప్పకుండా తనలో తాను కుమిలిపోయింది. ఇదిలా ఉండగా తండ్రి అత్యాచారాన్ని కొడుకు వీడియో తీశాడు.అయితే తన తండ్రికి చేతబడి చేశారని భావించానని, అందుకే తన గదిలో కెమెరా పెట్టినట్లు నిందితుడి కొడుకు చెప్పాడు. దీంతో అత్యాచారం చేసిన ఘటన రికార్డయిందని కొడుకు పోలీసులకు తెలిపాడు.

బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి కుమారుడు తనకు పంపిన ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బాధితురాలి తండ్రి పోలీసులకు చూపించాడు. కాగా నిందితుడు బాధితుల కుటుంబానికి తెలిసినవాడేనని తెలుస్తుంది. తరచూ ఇంటికి వచ్చేవాడని బాలిక తండ్రి ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. ఇక నిందితుడిని, అతని కుమారుడిని విచారించిన అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 376, 506, 354 కింద కేసు నమోదు చేశారు.

Read More: Congress : ఖ‌మ్మంలో “జ‌న‌గ‌ర్జ‌న‌”.. భ‌ట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు స‌భ వేదిక నుంచే.. ?