Hyderabad Crime: పెళ్ళికి చేసుకోవాలని వివాహిత పట్టుబడటంతో ఆమెను వాటర్ ట్యాంకర్ కిందకు తోసేసి తన చావుకు కారణమయ్యాడు ఓ వ్యక్తి. కామారెడ్డి జిల్లాలో ఉంటున్న వివాహిత ప్రమీల భర్త ఆరు నెలల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని కొండాపూర్లో ఓ ప్రయివేట్ షోరూములో ఉద్యోగం చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతికి ప్రమీల మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళకి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొన్ని నెలలుగా పెళ్లి చేసుకోవాలని ప్రమీల తిరుపతిని కోరింది. ఈ క్రమంలో ఆదివారం తనను కలవాలని బాచుపల్లికి పిలిపించాడు. తిరుపతిని కలిసేందుకు ఆమె ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళింది. ఈ క్రమంలో పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే రెండు మూడు నెలలో పెళ్లి చేసుకుంటానని తిరుపతి నమ్మబలికాడు. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలని ప్రమీల ఒత్తిడి చేసింది. అలా వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడినుండి తిరుపతి వెళ్లిపోతుండగా, అతడిని ప్రమీల అనుసరించింది. దీంతో మళ్ళీ వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ సమయంలో అదే దారిలో వాటర్ ట్యాంకర్ రావడం గమనించిన తిరుపతి ప్రమీలను ట్యాంకర్ కిందకు తోసేసాడు. వాటర్ ట్యాంకర్ బాధితురాలిపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు తిరుపతిపై కేసు నమోదు చేశారు.
Also Read: Bholaa Shankar Hyper Aadi Speech : అన్న మంచోడు కాబట్టి ముంచేశారు..తమ్ముడు మొండోడు..