Site icon HashtagU Telugu

Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే

Bird

Bird

“మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం” అంటూ ఓ వ్యక్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అందరూ మెచ్చుకునేలా ఆయన ఏం చేసి ఉంటారని అనుకుంటున్నారు ? చండ ప్రచండమైన ఎండల ధాటికిట్ సొమ్మసిల్లి పడిపోయిన ఓ పిచుకకు నీళ్లు తాగించి ప్రాణాలు నిలిపినందుకు !! ఈ పని చేసిన వ్యక్తికి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చని కొందరు కామెంట్స్ పెట్టారు. ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియో ను ట్విటర్ లో షేర్ చేశారు. పర్యావరణ, జంతు ప్రేమికుడైన ఆయన ఇటువంటి వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈక్రమంలోనే పిచుకకు నీళ్లు తాగించే ఒక వీడియో ను ఆయన షేర్ చేశారు. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. “ఇదే మానవత్వం”, “గుండెలు పిండేసింది బాసు” అని కొందరు కామెంట్స్ పెట్టారు. వీటన్నింటి కంటే
అవనీష్ శరణ్ పెట్టిన ” దో బూంద్ జిందగీ కే” కామెంట్ కు ఎక్కువ షేర్స్, లైక్స్, వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద ట్విట్టర్ లో ఈ వీడియో 32000 వ్యూస్, 2500 లైక్స్ సాధించింది.