Site icon HashtagU Telugu

Dundigal: భార్య చికెన్ వండ‌లేద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త‌

45

45

చికెన్ వండ‌టానికి త‌న భార్య నిరాక‌రించ‌డంతో ఆటో డ్రైవర్ విషం తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైద‌రాబాద్ లోని దుండిగల్‌లో కుటుంబంతో సహా నివసిస్తున్న ఎం. రతన్‌లాల్‌ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వ‌చ్చాడు. సమీపంలోని దుకాణంలో చికెన్ కొనుగోలు చేసి తీసుకెళ్లాడు.

త‌న భార్య‌ను చికెన్ వండ‌మ‌ని అడ‌గగా.. కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో మాంసాహారం వండనని భార్య చెప్పింది. దీంతో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత రతన్ లాల్ ఇంట్లో దొరికిన విషాన్ని తాగాడని దుండిగల్ పోలీసులు తెలిపారు. అతని భార్య తన పొరుగువారికి, బంధువులకు సమాచారం అందించగా.. వారు రతన్ లాల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.