Site icon HashtagU Telugu

PM Modi: గాంధీ వర్ధంతి సందర్భంగా మోడీ ‘మన్ కీ బాత్’

Modi

Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది.  ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు ప్రారంభమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది.  మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను పంపవచ్చు. స్వర సందేశాలను పంపాలనుకునేవారు… 1800 11 7800 నెంబర్ కు 28వ తేదీ వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్ సైట్ ద్వారా కానీ.. 1922 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా.. తిరిగి మన మొబైల్ కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.