New Record : ముక్కు రంధ్రాలతో మూడు లారీ ట్యూబులకు గాలి ఊది సరికొత్త రికార్డును సృష్టించిన వ్యక్తి..?

ప్రతి ఒక్క మనిషి లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే కొందరు వారి టాలెంట్ ను సమయం సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొందరు వారి టాలెంటుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 06:00 AM IST

ప్రతి ఒక్క మనిషి లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే కొందరు వారి టాలెంట్ ను సమయం సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొందరు వారి టాలెంటుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధిస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వారిలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించాడు. సాధారణంగా మనం ముక్కుతో గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వల్ల ముక్కుతో గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతూ ఉంటుంది.

అలాంటి సమయంలో చాలామంది నోటిని ఉపయోగించి నోటి ద్వారా గాలిని పీల్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ఒక వ్యక్తి యొక్క మాత్రం ఏకంగా ముక్కు రంధ్రాలతో లారీ చక్రాలకు గాలిని ఎక్కించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు చెందిన ఒక వ్యక్తి కేవలం తన ముక్కు రంధ్రాలను మాత్రమే ఉపయోగించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లారీ ట్యూబ్‌లకు గాలికొట్టి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాయామ యోగాపై అవగాహన కల్పించడం కోసం 9:45 సెకన్లలో ఈ ఫీట్ చేసి ఔరా అనింపించాడు సేలం జిల్లా అత్తనూర్ ప్రాంతంలోని ఇలంపిళ్లైకి చెందిన నటరాజ్ కరాటే కోచ్.

అతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో సహా 97 విభిన్న ఈవెంట్‌లలో ప్రదర్శన ఇవ్వగా తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20న తన 98వ రికార్డును పూర్తి చేశాడు. యోగాలో కీలకమైన ప్రాణాయామం గురించి అవగాహన కల్పించేందుకు నటరాజ్ తన ముక్కు రంధ్రాల ద్వారా లారీ చక్రాలకు ఉపయోగించే మూడు ట్యూబ్‌లలోకి గాలిని ఎక్కించి రికార్డు సృష్టించి శభాష్ అని పించుకున్నాడు. జ్యుడీషియల్ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో 9 నిమిషాల 45 సెకన్లలో ప్రదర్శించిన ఈ ఈవెంట్‌ను వరల్డ్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి ధృవీకరించింది. అయితే ఇటువంటి వాటిని సరైన శిక్షణ లేకుండా ఎవరైనా ప్రయత్నిస్తే వారి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని నటరాజ్ తెలిపాడు.