Site icon HashtagU Telugu

Delhi-Kanpur train: రైలు కిటికీ నుంచి యువకుడి గొంతులోకి దిగిన ఇనుప రాడ్.. అక్కడిక్కడే మృతి?

Delhi Kanpur Train

Delhi Kanpur Train

మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వస్తుందో అంచనా వేయడం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రెప్పపాటు కాలంలో మృత్యువు కంబలించి మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. అప్పటివరకు నవ్వుతూ ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా చనిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా ఒక యువకుడి విషయంలో కూడా మృత్యువు ఊహించని విధంగా అతన్ని ఆవహించింది. ఒక యువకుడు రైలులో కిటికీ దగ్గర కూర్చొని ప్రయాణిస్తుండగా అద్దాలను పగులకొట్టుకుని మరీ ఓ రాడ్డు రూపంలో మృత్యువు వచ్చి అతడి ప్రాణాలు తీసింది. తాజాగా ఈ భయంకరమైన ఘటన ఢిల్లీ కాన్పూర్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు రైలులో జనరల్ కోచ్ లో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఢిల్లీ కాన్పూర్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దన్వార్ సోమ్నా మధ్యలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో బయటి నుంచి ఓ ఇనుమ రాడ్డు బలంగా దూసుకొచ్చి కిటికీ అద్దాన్ని పగులకొట్టి మరి ఆ యువకుడి మెడలోకి దూసుకుపోయింది. అయితే ఆ ఇనుప రాడ్ మెడ ముందు భాగం నుంచి దిగి వెనుక భాగం నుంచి ఆ రాడ్డు బయటకు వచ్చింది. దాంతో ఆ యువకుడు కూర్చున్న సీటులోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం అలీగఢ్ జంక్షన్ వద్ద రైలును ఆపి, అతడి మృతదేహాన్ని అధికారులు పరిశీలించారు. కాగా చనిపోయిన యువకుడి వివరాలు ఇలా ఉన్నాయి.. అతడి పేరు హృశికేశ్ దుబే (34) అని అతడి స్వస్థలం సుల్తాన్ పూర్. అయితే ఉపాధి నిమిత్తం ఢిల్లీలో నివసించేవాడని, అయితే అతను రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే ట్రాకులపై పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా ఆ రాడ్డు కిటికీ నుంచి దూసుకొచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.