World Cup 2023: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు

అక్టోబర్‌ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి.

World Cup 2023: ప్రపంచ కప్ మొదలైంది. టీమిండియా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి వన్డే ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అక్టోబర్‌ 14న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. అయితే భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బెదిరింపుతో గుజరాత్ పోలీసులు మోదీ స్టేడియానికి భద్రత రెట్టింపు చేశారు. అణువణువు గాలిస్తున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కరణ్ మావి అనే నిందితుడిని రాజ్‌కోట్‌లో అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. బాంబ్ బెదిరింపు అంశాన్ని హిందీలో రాసి మెయిల్‌ ద్వారా బీసీసీఐకి పంపాడు. 14-10-2023న నరేంద్ర మోదీ స్టేడియంలో పేలుడు జరుగుతుందని మెయిల్ లో పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన మావిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. భారత్‌-పాక్‌ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది.

Also Read: TDP : ఐఆర్ఆర్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర – టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌