Site icon HashtagU Telugu

Minister Prashanth Reddy : మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో వ్య‌క్తి అనుమాన‌స్ప‌ద మృతి

Sucide Imresizer

Sucide Imresizer

తెలంగాణ‌ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిగత సహాయకుడు దేవెంద‌ర్ మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. మంత్రి ఇంట్లో దేవేందర్ మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవేందర్ రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, పోస్టుమార్టం విచారణలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు.