Site icon HashtagU Telugu

Suicide : హైద‌రాబాద్‌లో ఫ్లైఓవర్ పైనుండి దూకి వ్య‌క్తి మృతి

Sucide Imresizer

Sucide Imresizer

హైదరాబాద్ బాలానగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఓ వ్య‌క్తి మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముప్పై ఏళ్ల వయసున్న మృతుడు.. భవన నిర్మాణ కార్మికుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటలకు జరిగిందని బాలానగర్ క్రాస్‌రోడ్‌కు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ మధ్యలో వ్యక్తి వచ్చి దూకిన‌ట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడని దర్యాప్తు చేస్తున్న బాలానగర్ పోలీసులు తెలిపారు.