హైదరాబాద్ బాలానగర్ (Balanagar) ప్రాంతంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం (Road Accident) ఓ కుటుంబంలో విషాదం నింపింది. ట్రాఫిక్ తనిఖీలు చేస్తూ ఓ కానిస్టేబుల్ (Traffic Constable) చూపించిన ఓవరాక్షన్ వల్ల కార్పెంటర్‌గా పనిచేస్తున్న జోజిబాబు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చింతల్ నుంచి బాలానగర్‌కు వెళ్తున్న జోజిబాబు బైక్‌ను ఆపాలని పోలీస్ కోరినప్పటికీ, రోడ్డు మధ్యలో ఉండటంతో బైక్‌ను పక్కకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ కానిస్టేబుల్ అతడి బైక్‌ను మధ్యలోనే లాగడంతో జోజిబాబు కిందపడ్డాడు..అదే సమయంలో వెనక నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిపై నుండి వెళ్లడం తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
Amazon : అమెజాన్ ఇండియాతో ఇండియా SME ఫోరం ఒప్పందం
ఈ ఘటన అనంతరం స్థానికులు కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడన్న ఆరోపించారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాఫిక్ తనిఖీల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెకింగ్ పేరుతో కొంతమంది పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం జోజిబాబు తనిఖీలకు భయపడి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడని అంటున్నారు.