Dance With Pythons: ఏందిరాయ్యా ఇది…పాములతో డ్యాన్సా..?

చాలామంది పాములంటే గజగజా వణికిపోతారు.

Published By: HashtagU Telugu Desk
dance with pythons

dance with pythons

చాలామంది పాములంటే గజగజా వణికిపోతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపే కన్నెత్తి చూడరు. అలాంటిది పాములతో కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటే…భయంతో వణికిపోతున్నారు కదూ. కానీ తాజాగా ఓ వ్యక్తి రెండు భారీ కొండచిలువలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోను వరల్డ్ ఆఫ్ స్నేక్స్ అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు.

ఆ రెండు కొండచిలువలు ప్రపంచంలోనే అతి పొడవైనవని ఆ వ్యక్తి ఇన్ స్టా హ్యాండిల్లో పేర్కొన్నారు. ఆ రెండు కొండచిలువలను ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి భుజాలపై వేసుకుని బ్యాగ్రౌండ్ లో వస్తున్న బీట్ కు అనుగుణంగా డ్యాన్స్ అదరగొట్టాడు. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన వెంటనే తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికి 44వేలకు పై లైక్స్ వచ్చాయి. ఆ వ్యక్తి ధైర్యానికి చాలా మంది నెటిజన్లు విస్తుపోతున్నారు.

 

  Last Updated: 03 May 2022, 12:27 AM IST