Site icon HashtagU Telugu

Uttar Pradesh: బతికుండగానే తనకు తానే అంతక్రియలు నిర్వహించుకున్న వృద్ధుడు.. అసలేం జరిగిందంటే?

Uttar Pradesh

Uttar Pradesh

మామూలుగా సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు వింటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంకొన్ని సంఘటనలు వింటే సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్న సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సంఘటనలు బాధలు కలిగించేవిగా కూడా ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన పని అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ విచిత్ర సంఘటన విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి బతికుండగానే తనకు తానుగా అంత్యక్రియలు నిర్వహించుకున్నాడు.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని కేవాన్‌ గ్రామానికి చెందిన జటా శంకర్‌కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్‌15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు కూడా ఏర్పాటు చేశాడు.

అంతేకాకుండా శంకర్‌ తన సమాధి కోసం ఒక కాంక్రీట్‌ ఫ్లాట్‌ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్‌ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం తెలియడంతో అందరూ ఆ ఘటన విని ఆశ్చర్యపోతున్నారు. సదరు వృద్ధుడు పట్ల కుటుంబం వ్యవహరిస్తున్న తీరును చూసి మండిపడుతున్నారు..

Exit mobile version