Site icon HashtagU Telugu

CPR : సీపీఆర్ చేసిన తండ్రిని కాపాడిన కొడుకు.. తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద ఘ‌ట‌న‌

CPR

CPR

తాజ్ మహల్ ప్రాంగణంలో కుప్పకూలిన తన తండ్రిని నేవీ అధికారి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేసి ర‌క్షించాడు. రామ‌రాజు అనే వ్య‌క్తి తాజ్ మహల్ సెంట్రల్ ట్యాంక్ వద్ద కుప్పకూలి స్పృహతప్పి పడిపోయాడు.అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప‌డుతుండ‌టం ఇది గుండెపోటు అని అనుమానించిన అధికారి వెంటనే తన తండ్రి చుట్టూ ఉన్న స్థలాన్ని క్లియర్ చేసి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆగ్రాలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. CISF సిబ్బంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) యొక్క ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రాజును వీల్ చైర్‌లో తాజ్ మహల్ గేట్‌కు త్వరగా తరలించారు, అక్కడ నుండి అంబులెన్స్ అతన్ని ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లింది.