Hyderabad: రెస్టారెంట్ లో పెరుగు కోసం యువకుడు దారుణ హత్య

పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ కి వచ్చిన వ్యక్తిని సిబ్బంది చంపేసిన ఘటన నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..

Published By: HashtagU Telugu Desk
Hyderabad

New Web Story Copy 2023 09 11t115709.725

Hyderabad: పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ కి వచ్చిన వ్యక్తిని సిబ్బంది చంపేసిన ఘటన నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. చాంద్రాయణగుట్టలోని హష్మతాబాద్‌కు చెందిన బాధితుడు మహ్మద్ లియాఖత్ (31) ఆదివారం రాత్రి 11 గంటలకు తన స్నేహితుడితో కలిసి భోజనానికి రెస్టారెంట్‌కు వచ్చాడు. తాను రైతా కావాలని సిబ్బందిని కోరడంతో వాగ్వాదం మొదలైంది. హోటల్‌లోని వెయిటర్ అతని అభ్యర్థనను పట్టించుకోలేదని వాగ్వాదానికి దిగాడు. మేనేజర్ మరియు ఇతర సిబ్బంది అతనిపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్రమైంది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. త్వరితగతిన విచారిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్‌ చేయడమేంటి : పీవీ రమేశ్‌

  Last Updated: 11 Sep 2023, 12:54 PM IST