దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కొంతమంది కామాంధులు , కీచకులు , దుర్మార్గులు వారి తీరును మార్చుకోవడం లేదు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. అంతేకాదు పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా తమ కామ కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి వారిపై కోర్టులు కఠిన శిక్షలు విధించినప్పటికీ..మిగతావారిలో మార్పు రావడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో మహిళలపై అఘాయిత్యాలు పాల్పడం.. దాడులు చేయడం ..వంటి వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ (Hyderabad) మహానగర నడిబొడ్డున అందరు చూస్తుండగా..ఓ మహిళను వివస్త్రను చేసాడు ఓ కీచకుడు (Man Assault Woman). స్థానికులు అడ్డుకోవడానికి ట్రై చేసినప్పటికీ వారిపై కూడా దాడి చేసాడు. ఇక్కడ మరో ఆశ్చర్య కరమైంది ఏంటి అంటే..సదరు కీచకుడు ఆలా చేస్తుంటే..అతడి తల్లి సపోర్ట్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్ రోడ్లు నిత్యం జనాలతో కిక్కిరిపోతుంటాయి. ఇక ఆదివారమైతే చెప్పాల్సిన పనేలేదు. అంత రద్దీగా ఉండే ప్రాంతంలో యువతిపై ఒక కీచకుడు అత్యంత దారుణానికి ఒడికట్టాడు.
బాలాజీ నగర్ (Balaji Nagar) లో శాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను పెద్దమారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. అడ్డుకోబోయిన మహిళను అతి దారుణంగా కొట్టి అందరూ చూస్తుండగానే బట్టలను చింపి వివస్త్రను చేశాడు. దీనిని అడ్డుకోబోయిన స్థానికులపై కూడా దాడి చేశాడు. ఇదంతా కూడా తన కన్నతల్లి సమక్షంలో జరగడం, ఆ తల్లి తన కొడుకును సమర్ధించడం అందరినీ షాక్ కు గురి చేసింది. స్థానికల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధిత మహిళకు రక్షణ కల్పించి, సదరు వ్యక్తి ఫై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సదరు బాధితుడు ఎందుకు ఆలా చేసాడనేదానిపై విచారిస్తున్నారు.
Read Also : National Handlooms Day: చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్