ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Andhra Deputy CM Pawan Kalyan) ను చంపేస్తామంటూ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ (Death Threat Call) రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై హోంమంత్రి అనిత (Home Minister Anita)వెంటనే స్పందించి.. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో..త్వరగా కనుక్కోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణలంక పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించి , బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విజయవాడ (Vijayawada) లబ్బీపేట(Labbipet)లోని వాటర్ ట్యాంక్ రోడ్ (Water Tank Road)వద్ద నివాసం ఉంటున్న మల్లికార్జున్ (Mallikarjun) అని నిర్ధారించారు. మల్లిఖార్జున కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా అతను నగరంలోనే దొరికాడు. దీంతో అతని స్థానిక పీఎస్ కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పేషీ నంబర్లు ఎలా దొరికాయి, ఫోన్ చేసి ఏమేం మాట్లాడాడన్న దానిపై విచారిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
Read Also : Pushpa 2 Success Party : పుష్ప 2 సక్సెస్.. చిత్ర యూనిట్ ప్రైవేట్ పార్టీ..!