Site icon HashtagU Telugu

Hyderabad: మైనర్ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్

Hyderabad

Hyderabad

Hyderabad: యువతులను బెదిరించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించిన మేడ్చల్‌కు చెందిన జిష్ణు కీర్తన్ రెడ్డి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెడతానని బెదిరించి తన నగ్న చిత్రాలను పంపాలని ఓ ఆగంతకుడు బెదిరించడంతో ఆ అమ్మాయి తండ్రికి చెప్పడంతో కథ వెలుగులోకి వచ్చింది.

ప్రతిరోజూ తన నగ్న ఫోటోలు, వీడియోను పంపకుంటే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని నిందితుడు కీర్తన్ రెడ్డి తన కుమార్తెపై ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.డిసెంబర్ 28 న పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిపై సెక్షన్లు 67, 67A, 66 (C), 66 (D) IT ACT & 354D, 506, 509 IPC, మరియు 11 r/w 12 POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

అమ్మాయిలు, మహిళలు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలియని వ్యక్తులతో చాట్ చేయడం, వాళ్లకు ప్రైవేట్ ఫోటోలు పంపవద్దన్ని డీసీపీ సైబర్ క్రైమ్స్ శిల్పవల్లి సూచించారు.సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయాందోళన చెందవద్దని, తక్షణ సహాయం కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేయాలనీ సూచించారు.

పోలీసులు కీర్త‌న్ రెడ్డి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. కేసు తదుపరి విచారణ కోసం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు మరియు అతను ఎంత మంది మహిళలు, బాలికలను బెదిరించి ఫోటోలు మార్ఫింగ్ చేశాడో తెలుసుకోనున్నారు.

Also Read: YCP Key Leaders To Join TDP : ఒకేరోజు టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ కీలక నేతలు..

Exit mobile version