కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు (Mangaluru) నగరంలో 69 ఏళ్ల సతీష్ కుమార్ ..తన పొరుగు ఇంటి వక్తి మురళిని కారు తో ప్రమాదం చేసి జైలు పాలయ్యాడు. ఈ ఘటన మార్చి 13న ఉదయం 8:15 గంటల ప్రాంతంలో బిజై కపికాడ 6వ మెయిన్ రోడ్డులో జరిగింది. ఈ ప్రమాదంలో మురళి ప్రసాద్ తీవ్రంగా గాయపడగా, మరో పాదచారి మహిళ కూడా గాయాలపాలయ్యింది. సతీష్ కుమార్, మురళి ప్రసాద్ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. 2023లో కూడా సతీష్ కుమార్, మురళి ప్రసాద్ తండ్రిని బైక్‌పై ఢీకొట్టిన సంఘటనపై ఉర్వా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా ఘటనలో నిందితుడు కారులో ముందుగా వేచి ఉండి, మురళి ప్రసాద్ తన బైక్‌పై రోడ్డుపై రాగానే కారును అతనిపై ఎక్కించాడు.
CM Revanth Reddy: హైకమాండ్‌తో నాకు బలమైన సంబంధాలు: సీఎం రేవంత్
ఈ ఘటనలో మురళి ప్రసాద్ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే సమయంలో ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ కూడా ఈ ప్రమాదానికి గురైంది. ఆమెకు రక్తస్రావం అయ్యి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సతీష్ కుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సతీష్ ఫై హత్యాయత్నం (attempted murder) కేసు కింద ఉర్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా పాదచారికి గాయాలు చేసినందుకు మంగళూరు ట్రాఫిక్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చగా, న్యాయమూర్తి అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు.