Patna Opposition Meet: లాలూతో మమతా.. రేపు పాట్నాలో విపక్షాల మీటింగ్ పై చర్చ

బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి విపక్షాలను ఏకం చేయడంలో పలు పార్టీలతో సమావేశమయ్యారు.

Patna Opposition Meet: బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయడంలో పలు పార్టీలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధినాయకులతో ఆయన భేటీ కొనసాగింది. ఇక తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకేశారు. రేపు పాట్నాలో జరగబోయే విపక్షాల మీటింగ్ కోసం ఆమె సంసిద్ధమయ్యారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్‌ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసంలో లాలూతో మమత భేటీ అయ్యారు. అంతకుముందు మమతా బెనర్జీ పాట్నా విమానాశ్రయానికి చేరుకున్నారు. రేపు జూన్ 23 న పాట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది. అందులో భాగంగానే ఆమె లాలూతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. దేశాన్ని ‘విపత్తు’ నుంచి కాపాడాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆమె అన్నారు. అయితే రేపు జరిగే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో ఈరోజు చెప్పబోనని చెప్పారు. విపక్షాలన్నీ ఏకమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు.

Read More: Minister Roja: చిరంజీవి తాతయ్య అయినందుకు సంతోషంగా ఉంది: రోజా