Site icon HashtagU Telugu

Mamata Banerjee Injured: సీఎం మ‌మ‌తా హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ .. మోకాలికి గాయం

Mamata Banerjee

New Web Story Copy 2023 06 27t193450.013

Mamata Banerjee Injured: నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బెంగాల్ పర్యటనలో ఉన్న మతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. నిజానికి ఆమె పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు ఉత్తర బెంగాల్‌లో రెండు రోజుల పర్యటన ఖాయమైంది. అయితే వాతావరణం సహకరించకపోవడంతో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో హడావుడిగా కిందకు దిగే క్రమంలో ముఖ్యమంత్రి కాలుకు, నడుముకు గాయమైంది. దీంతో ప్రాథమిక చేసి అంబులెన్స్ లో కోల్ కోతకు తరలించారు. అనంతరం ఆమె ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ C.V. ఆనంద్ బోస్ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు.

Read More: Family God: కుల దైవాన్ని మరిస్తే అలాంటి కష్టాలు ఎదురవుతాయా?