Site icon HashtagU Telugu

Mallu Swarajyam: మల్లు స్వరాజ్యానికి తీవ్ర అనారోగ్యం!

Mallu

Mallu

తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లు స్వరాజ్యం వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఆమె అనారోగ్యానికి గురికావడం పట్ల తెలంగాణ మేదావులు, రాజకీయనాయకులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మల్లు స్వరాజ్యాన్ని పరామర్శించారు. సీపీఎం పార్టీ నుండి ఎమ్మెల్యే గానూ పనిచేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం, ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలకు ఊపిరి పోస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేస్తున్న మల్లు నాగార్జున రెడ్డి ఆమె కుమారుడే కావడం విశేషం. ఆమె కోడలు మల్లు లక్ష్మీ కూడా సీపీఎం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా పని చేస్తున్నారు.