Site icon HashtagU Telugu

Mallu Ravi : చంద్రబాబుకు కోపం వస్తే..ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుంది – మల్లు రవి

Malluravi

Malluravi

చంద్రబాబు, నితీశ్‌ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని..వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి. బుధువారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ..మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడుస్తుందని , తొందరలోనే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలోని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని మల్లు రవి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

రాహుల్‌ త్వరలోనే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే త్వరలోనే రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేస్తుందని ఎంపి మల్లు రవి తెలిపారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి, బిఆర్‌ఎస్ కలిసిన కాంగ్రెస్‌ను ఎదుర్కొలేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ చచ్చి, బిజెపికి జీవం పోసిందన్నారు.

Read Also  : T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు