Site icon HashtagU Telugu

Mallikarjun Kharge : విజ‌య‌వాడ చేరుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

Mallikarjun Kharge Imresizer

Mallikarjun Kharge Imresizer

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయ‌న‌కు కాంగ్రెస్ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఏఐసిసి అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ నేపథ్యంలో 320 మందిని కలిసి తనకు మద్దతు తెలపాలని కోరడానికి వచ్చిన ఖర్గే విజ‌య‌వాడ వ‌చ్చారు. ఖర్గేకు ఘన స్వాగతం పలికిన వారిలో కెవిపి రామచంద్రరావు ,ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, నేతలు కొప్పుల రాజు, కార్యదర్శి జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సెరివెళ్ళ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్‌లు ఉన్నారు.