సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ (Art Director Passes Away) సునీల్ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తమిళ హీరో విజయ్ నటించిన ‘వారీసు’ మూవీకు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు వర్క్ చేశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామం, MS ధోనీ, గజిని సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. సునీల్ మలయాళం, తమిళం, తెలుగు, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పనిచేశాడు.
Also Read: Accused Of Morphing Photos: అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్.. పోలీసుల అదుపులో నిందితుడు
మైసూరు ఆర్ట్స్ కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత సునీల్.. సాబు సిరిల్‌తో కలిసి ప్రొడక్షన్ డిజైనర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మలయాళ చిత్రాలైన అనంతభద్రం, బెంగుళూరు డేస్, కాయంకులం కొచ్చున్ని, పజాసిరాజా, ఉరుమి, చోటా ముంబై వంటి అనేక చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ హోదాలో అనేక హిట్ చిత్రాలకు సునీల్ బాబు పనిచేశారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కు మలయాళ చిత్రం అనంతభద్రమ్‌లో తన పనికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. అతను బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశాడు. సునీల్‌కు భార్య ప్రేమ, కుమార్తె ఆర్య సరస్వతి ఉన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ ఆర్ట్ డైరెక్టర్‌కు నివాళులర్పించారు. వీరిద్దరూ గతంలో బెంగుళూరు డేస్, ఇటీవల విడుదలైన సీతారామం చిత్రంలో కలిసి పనిచేశారు.