Yoga Benefits: సింహాసనం వేస్తే అవి బాగా తగ్గుతాయట.. మలైకా ఆరోరా కోచ్ వీడియో వైరల్!

మన దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగా కండరాల

Published By: HashtagU Telugu Desk
Simhasan

Simhasan

మన దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగా కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. అలాగే శరీరంలోని కేలరీలను బర్న్ చేసి అధిక బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగ చేయడం ఎంతో ముఖ్యం. ఇది హృదయ అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక రుగ్మత లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

అలాగే వివిధ రకాల యోగ భంగిమలు వివిధ శరీర కండరాలను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే యోగాలో సింహాసనం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్ని మలైకా అరోలా పర్సనల్ కోచ్ సర్వేశ్ శశి వెల్లడించారు. ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సింహాసనం ప్రయోజనాలు తెలిపి ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో సింహాసనం ఏ విధంగా వేయాలి అందువల్ల కలిగే లాభాలను కూడా వివరించారు. సింహాసనం ఒత్తిడి కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది అని సర్వేశ్ వెల్లడించారు.


ఆ ఆసనం చేతి నుంచి ముఖం ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుందట. అలాగే నరాలను సంక్రియం చేస్తుంది. కళ్ళ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖానికి రక్తప్రసరణను పెంచుతుంది. అదేవిధంగా ఉబ్బసం గొంతు నొప్పి లాంటి శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

  Last Updated: 13 Sep 2022, 06:10 PM IST