Site icon HashtagU Telugu

Nag First look: నాగార్జున బ్రహ్మాస్త్రం!

Bramhastra

Bramhastra

భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర”. ఈ సినిమా తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున “నంది అస్త్ర” అనే శక్తీ ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు. ఒక అస్త్రంలో వేయి నందిలా బలం ఉంటుంది.

సహస్ర నదీమ్ సమరత్యం
హే నంది అస్త్రం
ఖండ్ ఖండ్ కురు
మమ్ సహక్యం మమ్ సహక్యం

రీసెంట్ గా రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ S. S. రాజమౌళితో కలిసి “బ్రహ్మాస్త్రం” సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నగరాన్ని సందర్శించారు. జూన్ 15 న బ్రహ్మస్త్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.