Site icon HashtagU Telugu

Akhil: ‘ఏజెంట్స్’ పై రూమర్స్.. మేకర్స్ క్లారిటీ!

Agent

Agent

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’లో నటుడు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు ముగింపు పలికేందుకు మేకర్స్ ఓ ప్రకటన చేశారు. మనాలిలో ‘ఏజెంట్’ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. టీజర్ అప్‌డేట్ త్వరలోనే ఉంటుంది. ‘‘దయచేసి పుకార్లను నమ్మొద్దు” అని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 12న ‘ఏజెంట్’ విడుదల కానుంది. అయితే గత కొన్ని రోజులుగా సినిమా విడుదలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా జరుగుతోందని కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్.. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయగలుగుతున్నారట. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య అనే కొత్త నటి నటిస్తుంది. ‘ఏజెంట్’ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.