Site icon HashtagU Telugu

Egg Noodles: నోరూరించే ఎగ్ నూడిల్స్.. పది నిమిషాల్లోనే తయారు చేసుకోండిలా?

Mixcollage 09 Feb 2024 08 59 Pm 9249

Mixcollage 09 Feb 2024 08 59 Pm 9249

ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో చేసిన వంటలకంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ లో పిల్లల నుంచి పెద్దవారీ వరకు ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ ఎగ్ నూడిల్స్. చాలామంది వీటిని ఇంట్లో ట్రై చేయాలని అనుకుంటారు కానీ బయట చేసిన అంత టేస్టీగా రావు అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా వీటిని ఇంట్లో ట్రై చేయాలని అనుకుంటున్నారా. కేవలం పదే పది నిమిషాలు టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ ని ఎలా చేయాలో అందుకు ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎగ్ నూడిల్స్ కు కావలసిన పదార్థాలు:

నూడిల్స్ – 160 గ్రాములు
నీళ్లు – సరిపడినన్ని
కోడిగుడ్లు – 4
ఉప్పు – రుచికి సరిపడా
నల్ల మిరియాలు – తగినన్ని
వెల్లుల్లి తురుము – తగినంత
ఆనియన్స్ – సరిపడినన్ని
క్యాప్సికం – సరిపడా
కారం- తగినంత
క్యాబేజీ తురుము
టమోటా సాస్
సోయాసాస్
వెనిగర్

ఎగ్ నూడిల్స్ తయారీ విధానం :

ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో మూడు కప్పుల నీరు కొద్దిగా ఉప్పు వేసుకుని అయిదు నిమిషాల పాటు కాగనివ్వాలి. ఇందులో నూడిల్స్ వేసుకొని 80 శాతం వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటిని బాగా వడకట్టుకొని ఈ నూడిల్స్ పైనుంచి చల్లని నీటిని పోసుకొని, ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నాలుగు గుడ్ల సోనను తీసుకొని అందులోనే ఉప్పు, తగినంత మిర్యాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో నూనెను బాగా వేడి చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి. ఇలా వేయించుకున్న కోడిగుడ్ల ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, మరోసారి బాగా వేడి చేసుకుని అందులోనే అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, క్యాబేజీ తురుము, క్యారెట్ వేసుకొని మరోసారి చిటపటలాడే లాగా వేయించుకోవాలి.

Exit mobile version