శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర జ్యోతి దర్శనం కాగానే.. శరణు ఘోసతో శబరిమల సన్నిధానం మార్మోగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. దీంతో జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.
Watch📸: #MakaraJyothi2022 at #Sabarimala pic.twitter.com/TjQU2tQ5Ml
— All India Radio News (@airnewsalerts) January 14, 2022
