New Collectors: కొత్త జిల్లాల కలెక్టర్లు వీళ్ళే!

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.

Published By: HashtagU Telugu Desk
Ys Jagan Nampally Special Court

Ys Jagan Nampally Special Court

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.. 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసింది.
జిల్లాల వారీగా కలెక్టర్ల వివరాలు ఇవే…
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి
మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్
అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్
కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా
తూర్పుగోదావరి కలెక్టర్‌గా మాధవి లత
కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
పశ్చిమగోదావరి కలెక్టర్‌గా పి.ప్రశాంతి
ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా
ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్‌గా ఎస్. డిల్లీరావు
గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివశంకర్‌
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌
నెల్లూరు జిల్లాగా చక్రధర్ బాబు
శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీషా
కడప కలెక్టర్‌గా విజయరామరాజు
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ గా పి.బసంత్ కుమార్
అనంతపురం కలెక్టర్‌గా ఎస్.నాగ లక్ష్మి
నంద్యాల కలెక్టర్‌గా మనాజీర్ జిల్లా షామున్కోటేశ్వరరావు కర్నూలు జిల్లా కలెక్టర్‌

  Last Updated: 03 Apr 2022, 03:19 PM IST