Site icon HashtagU Telugu

Major: రిలీజ్ కు ముందే ‘మేజర్’ ప్రివ్యూ షోలు!

Major

Major

అడివి శేష్ పాన్ ఇండియా ఫిల్మ్ మేజర్ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సినిమాను చూపించేందుకు మేకర్స్ ఇప్పటికే సిద్దమయ్యారు. మేజర్ జూన్ 3న అధికారికంగా విడుదల చేయడానికి ముందు వివిధ నగరాల్లో ప్రత్యేక ప్రివ్యూ షోలు వేస్తారట. ఈ ప్రివ్యూ షోల నుండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పొందాలని ఆశిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. మేజర్ కు ప్లస్ అవుతుందని నిర్మాతల ఆలోచన. అయితే సాధారణంగా చిన్న చిన్న సినిమాల నిర్మాతలు కంటెంట్‌పై చాలా నమ్మకంగా ఉంటేనే.. ప్రీమియర్ షోలను ప్రదర్శించడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని బట్టి చూస్తే.. మేజర్ నిర్మాతలు సినిమా ఫలితంపై నమ్మకం ఉన్నారని తెలిసిపోతోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ ముఖ్య పాత్రలు పోషించారు.