South Africa Fire:దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటం, పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Fifdebrwyaewqdx Imresizer

Fifdebrwyaewqdx Imresizer

దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటం, పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు.
‘నేషనల్‌ అసెంబ్లీ భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. పైకప్పునకు మంటలు వ్యాపించాయి’ అని కేప్‌టౌన్‌ నగర అత్యవసర సేవల ప్రతినిధి ఒకరు.. ఓ వార్తాసంస్థకు చెప్పారు.

  Last Updated: 02 Jan 2022, 05:54 PM IST