Site icon HashtagU Telugu

Ankura Hospital: మంటల్లో అంకుర ఆసుపత్రి

Ankura Hospital

Ankura Hospital

Ankura Hospital: మెహిదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతినగర్ ప్రాంతంలోని పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 68కి సమీపంలో ఉన్న అంకురా ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 5:30 గంటలకు ఆసుపత్రి భవనం పైన ఉన్న ఫ్లెక్సీ నుండి మంటలు చెలరేగాయని ప్రాధమిక సమాచారం.

ముందు ఆరో అంతస్థులో మంటలు వ్యాపించి క్రమంగా అన్ని అంతస్థులకు వ్యాపించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలోని రోగులను అక్కడి నుంచి తరలించారు. ఆస్పత్రిలో ఎక్కువగా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు వుండటంతో వారిని బయటకు తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Also Read: Crimes Rate: సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు