Site icon HashtagU Telugu

AP DSC: ఏపీలో మెగా డీఎస్‌సీ అవ‌కాశాలు త‌క్కువే

Dsc

Dsc

ఆంధ్రప్రదేశ్‌లో టీచ‌ర్లను రిక్రూట్ చేయ‌డానికి dsc నిర్వహ‌ణ ఇప్పట్లో ఉండ‌క‌పోవ‌చ్చన్న అనుమానాలు నిరుద్యోగుల్లో క‌లుగుతున్నాయి. ప్రభుత్వానికి ఆ ఆలోచ‌న ఉన్నట్టు కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అధికారంలోకి వ‌స్తే భారీగా పోస్టుల‌ను భ‌ర్తీ చేసి, మెగా డీఎస్సీ నిర్వహిస్తామ‌ని పాద‌యాత్ర స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ హామీలు ఇచ్చారు.

డీఎస్సీపై ఇంతవ‌ర‌కు దృష్టి పెట్టలేద‌ని యూత్ అంటోంది. ఇందుకు ప్రధానంగా రెండు కార‌ణాలు క‌నిసిస్తున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ను 60 నుంచి 62 ఏళ్లకు పెంచ‌డం. ఈ కార‌ణంగా ఈ రెండేళ్లలో రిటైర్ అయ్యే టీచ‌ర్లు ఎవ‌రూ ఉండ‌రు. అందువ‌ల్ల ఖాళీలు అంటూ ఉండ‌వు. ఖాళీలు లేవ‌ని చెప్పి డీఎస్సీ ప్రక‌ట‌నే ఇచ్చే అవ‌కాశాలు లేవు. మ‌రొక ముఖ్యమైన విష‌యం… పాఠ‌శాల‌ల విలీనం.

3,4, 5 త‌ర‌గ‌తుల‌ను స‌మీపంలోని హైస్కూళ్లలో మెర్జ్ చేస్తారు. ఈ కార‌ణంగా ఒక‌రిద్దరు టీచ‌ర్లు త‌గ్గినా అడ్జెస్టు అయ్యే అవ‌కాశం ఉంది. ఇలాంటి సర్దుబాట్ల కార‌ణంగా రాష్ట్రంలో దాదాపు 25 వేల టీచ‌రు పోస్టులు మిగులుగా క‌నిపిస్తాయ‌ని అంచ‌నా. వీటిని తొలుత స‌ర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగులు పోస్టులు ఇంత భారీగా క‌నిపించిన‌ప్పుడు డీఎస్‌సీ నిర్వహ‌ణ‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే రాక‌పోవ‌చ్చని
యూత్ అంచ‌నా వేస్తోంది.

ప్రభుత్వానికి పెరుగుతున్న వ్యయం పరంగా చూసినా కొత్తగా టీచ‌ర్ల రిక్రూట్‌మెంట్ ఉండ‌క‌పోవ‌చ్చంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏజ్‌బార్‌కు ద‌గ్గర‌వుతున్నవారు ఇలాంటి ప‌రిస్థితిని చూసి ఆందోళ‌న చెందుతున్నారు. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ పోస్టులు భర్తీ చేయకపోతే నిరుద్యోగులపై అది ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Exit mobile version