Site icon HashtagU Telugu

Mahmood Ali: గన్ మెన్ చెంప చెల్లుమనిపించిన హోంమంత్రి, వీడియో వైరల్!

Mahamood Ali

Mahamood Ali

Mahmood Ali: తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీకి కోపం వచ్చింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గన్ మెన్ చంప చెల్లు మనిపించాడు. ఈ సంఘటన అమీర్ పేట డివిజన్ DK రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్ఫాహారం కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకుంది. మంత్రి తలసానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న సందర్భంగా గన్ మెన్ బోకే శాలు వెంటనే ఇవ్వ లేదని స్టేజి పైనే హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ గన్ మెన్ చంప చెల్లు మనిపించాడు. అందరి ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అక్కడ చర్చనియాఅంశం అయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మంత్రి తీరుపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

Also Read: Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు