Site icon HashtagU Telugu

Mahindra: ధరలను పెంచిన మహీంద్రా…ఎంతంటే..!!

Mahindra New Scorpio Front View0 Imresizer

Mahindra New Scorpio Front View0 Imresizer

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన వెహికల్స్ పై ధరలను పెంచేసింది. దాదాపు 2.5శాతం ధరలను పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్ 14 నుంచే అమల్లోకి వస్తున్నాయని కంపెనీ గురువారం ఎక్స్చేంజీలకు తెలిపింది. ఈ ధరల పెంపుతో మహీంద్రా వెహికల్స్ ఎక్స్ షోరూం ధరలు దాదాపు రూ. 10వేల నుంచి రూ.63వేల మధ్యలో పెరగనున్నాయి. మోడల్, వేరియంట్ ను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆటో తయారీలో ఉపయోగించే కీలకమైన కమోడిటీలు, స్టీల్, అల్యూమినియం, పల్లాడియం, ఇతర కమోడిటీల ధరలు పెరగడంతో…వెహికల్స్ ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక కమోడిటీల ధరలు అనూహ్య రీతిలో భారీగా పెరగడంతో…కంపెనీ అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ధరల సమీక్ష ద్వారా వినియోగదారులు కాస్తమేర ఖర్చులను బదిలీ చేశారని పేర్కొంది.

కాగా ఇప్పటికే పలు కార్ల కంపెనీలు సైతం తమ వాహనాలపై ధరల పెంపును ప్రకటించాయి. ఆటో కంపెనీలు ధరల పెంపును సమీక్షించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలోనే ధరల పెంచాయి ఆటో కంపెనీలు. రష్యా -ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, చైనాలో మళ్లీ కోవిడ్ భయాలు…వీటన్నింటితో ఆటో కంపెనీలకు కావాల్సిన పార్ట్ లు, మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పాడుతుంది. అంతేకాదు ఆటో కంపెనీలకు కీలకమైన సెమీ కండక్టర్ల కొరత భారీగా ఉంది. ఇప్పటికే మారుతీ, కియా, టాటామోటార్స్, ఎంజీమోటార్స్, హ్యుండాయ్, టయోటా, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు తమ వాహనాలపై ధరలను పెంచేశాయి. ఇప్పుడు వాటి బాటలోనే మహీంద్రా కూడా ధరలను పెంచేసింది.