Site icon HashtagU Telugu

FICCI President: FICCI అధ్యక్షుడిగా అనీష్ షా.. ఎవరీ షా..?

FICCI President

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

FICCI President: మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ CEO అయిన అనీష్ షా.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI President) 2023-24కి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సుభ్రకాంత్ పాండా స్థానంలో అనీష్ షా రానున్నాడు. రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షిక సదస్సులో ఆయన ఈ పదవికి నియమితులయ్యారు. అనీష్ షా కార్నెగీ మెల్లన్ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి PHD కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.

అనంత్ గోయెంకా వైస్ ప్రెసిడెంట్

షాతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హర్షవర్ధన్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్‌గా అనంత్ గోయెంకా, తక్షణ వైస్ ప్రెసిడెంట్‌గా సుభ్రకాంత్ పాండా, 2023-24 నాయకత్వానికి శైలేష్ కే. పాఠక్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

షా నియామకంపై మహీంద్రా గ్రూప్ అభినందనలు తెలిపింది. గ్రూప్ తన X పోస్ట్‌లో FICCI ప్రెసిడెంట్‌గా నియమితులైనందుకు మా గ్రూప్ CEO, MD అనిష్ షాను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అతని అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యాలతో భారతీయ వాణిజ్యం, పరిశ్రమల భవిష్యత్తును రూపొందించడంలో అతని సహకారం గురించి మేము సంతోషిస్తున్నామని పేర్కొంది.

Also Read: January: సంవత్సరంలో మొదటి నెలకు జనవరి అనే పేరు ఎలా వచ్చింది..?

FICCIకి కొత్తగా ప్రెసిడెంట్‌గా నియమితులైన అనీష్ షా మహీంద్రా గ్రూప్‌కు ముందు 2009-14 వరకు GE క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్, CEOగా ఉన్నారు. GE క్యాపిటల్ ఇండియాలో మొత్తం 14 సంవత్సరాలు ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా డెబిట్ ఉత్పత్తి వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇది కాకుండా షా బోస్టన్‌లోని బైన్ & కంపెనీ, ముంబైలోని సిటీ బ్యాంక్‌లో కూడా పనిచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

Exit mobile version