Site icon HashtagU Telugu

Mahima Chaudhary : మహిమా చౌదరికి బ్రెస్ట్ క్యాన్సర్ : అనుపమ్ ఖేర్ వెల్లడి..!!

92101507.jpg

92101507.jpg

ప్రముఖ నటి మహిమా చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బాలీవుడు నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. మహిమను ఆయన ఒక హీరోగా అభిర్ణించారు. అభిమానులకు ఈ విషయాన్ని నేనే చెప్పాలని మహిమ ఆశించారని అనుపమ్ ఖేర్ తెలిపారు.

మహిమా చౌదరి ధైర్యం…క్యాన్సర్ కు సంబంధించిన కథనం అంటూ అనుపమ్ పోస్టు చేశారు. నా 252 వ చిత్రం ది సిగ్నేచర్ లో కీలక పాత్ర పోషించే విషయమై నెల క్రితం నేను అమెరికా నుంచి మహిమాకు కాల్ చేశారు. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆమె వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు ఆశను కల్పిస్తుంది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలంటూ ఆమె కోరకుంది. అంటూ అనుపమ్ ఖేర్ ఒక పెద్ద పోస్టును పెట్ారు. స్నేహితులారా ఆమెకు మీ ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు అదించండి అంటూ కోరారు.

తన మూవీలో నటించాలని అనుపమ్ నాకు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. వెబ్ షోలు సినిమాల్లో నటించాలంటూ నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. కానీ నేను ఒకే చెప్పలేను.. ఎందుకుంటే నాకు జుట్టు లేదు అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అయితే తనకు క్యాన్సర్ లక్షణాలు లేవని…సాధారణ పరీక్షలో అదిబయటపడినట్లు ఆమె చెప్పారు.

Exit mobile version