Mahesh’s Comments: ‘బాలీవుడ్ వ్యాఖ్యల’పై మహేశ్ బాబు క్లారిటీ!

సూపర్‌స్టార్ మహేష్ బాబుకి గొప్ప కామిక్ టైమింగ్ ఉంది. వెండితెరమీదే కాకుండా బయటకు కూడా తనదైన స్టయిల్ లో ఫన్నీగా ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Mahesh

Mahesh

సూపర్‌స్టార్ మహేష్ బాబుకి గొప్ప కామిక్ టైమింగ్ ఉంది. వెండితెరమీదే కాకుండా బయటకు కూడా తనదైన స్టయిల్ లో ఫన్నీగా ఉంటారు. పలు సందర్భాల్లో మహేశ్ కామెడీ టైమింగ్ బయటపడింది కూడా. అయితే ఇటీవల మేజర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా రిపోర్టర్స్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. దానికి మహేష్ తన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. బాలీవుడ్ అరంగేట్రంపై చమత్కారమైన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం టైం వేస్ట్‌ చేసుకోవమే అవుతుంది. ఇక్కడ నాకు బాగానే ఆఫర్స్‌ వస్తున్నాయి’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే బాలీవుడ్ మీడియాలోని ఒక వర్గం దీనిని సెటైర్‌గా తీసుకుంది.

సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా స్పందించాల‌ని మ‌హేష్‌ని అడిగారు. తన వ్యాఖ్యలు ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యంతో లేవని మహేష్ స్పష్టం చేశారు. తెలుగు సినిమాలు చేయడానికే ఇష్టపడతానని, దేశమంతటా విడుదలై సినిమాలు కూడా ఇష్టపడతానని మహేష్ చెప్పాడు. తాను ఏ భాషలోనైనా ఇష్టపడతానని, నటుడిగా తాను ఏ భాషనైనా చిన్నచూపు చూడనని మహేష్ పేర్కొన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తప్పుగా చిత్రీకరించారని మహేష్ స్పష్టం చేశారు. సో, ఈ మొత్తం కథకు మహేష్ ముగింపు పలికాడు.

  Last Updated: 11 May 2022, 04:30 PM IST