Rachakonda CP: పోలీసులకు ‘కొవిడ్ కేర్’ జాగ్రత్తలు

  • Written By:
  • Updated On - January 21, 2022 / 03:44 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటునా 3 వేల నుంచి 5 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో.. ఆ ఎఫెక్ట్ పోలీసుల శాఖపై కూడా పడింది. గత రెండు, మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి అధికారులు సైతం హోంక్వారంటైన్ కే పరిమితం కావడం మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ కొవిడ్ బారినపడిన పోలీసు సిబ్బందితో మాట్లాడారు. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన వర్చుల్ సమావేశంలో మహేష్ భగవత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలీసులు కరోనాను ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు.