తెలంగాణ (Telangana) లో మళ్లీ బిఆర్ఎస్ (BRS) లోకి వలసల పర్వం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున పార్టీ నుండి నేతలు బయటకు వెళ్లి బిజెపి , కాంగ్రెస్ లలో చేరగా..ఇప్పుడు మళ్లీ ఆ పార్టీల నుండి బిఆర్ఎస్ లోకి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు చేరగా…తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి (Mahesh Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Sanjay Raut : 2026 తర్వాత ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో..? లేదో..?: సంజయ్ రౌత్
నిర్మల్ నియోజకవర్గం(Nirmal Constituency)లో బిజెపి పార్టీ లో సీనియర్ నేతగా పీవీ మహేశ్ రెడ్డి గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు ఆయన బిఆర్ఎస్ కండువా కప్పుకొని బిజెపి పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మహేశ్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మహేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.