Site icon HashtagU Telugu

Sitara Ghattamaneni : ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌‌లో మహేష్ బాబు కూతరు సితార!

Sitara

Mahesh Babu's Daughter Sitara In The Famous Times Square!

Sitara Ghattamaneni : మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార.. తండ్రికి తగ్గ తనయ.. సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు ఫాలోయింగ్‌ కూడా చాలా ఎక్కువే. ఇటీవల ‘సారంగదరియా’ పాటకు డ్యాన్స్‌ చేసి అందరితో వారెవ్వా అనిపించుకుంది. సితార పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సితార (Sitara) చేస్తున్న తొలి యాడ్‌ను మూడు రోజులు షూట్‌ చేశారని సమాచారం. సితార చేసిన తొలి కమర్షియల్‌ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానులు ఖుషి అవుతున్నారు.

Also Read:  Shivani Rajasekhar : యెల్లో అవుట్ ఫిట్ లో శివాని రాజశేఖర్ స్టన్నింగ్ లుక్స్