Site icon HashtagU Telugu

Namrata Shirodkar: ఫ్యాన్స్‌తో క‌లిసి సినిమా చూసిన మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌

namrata shirodkar

namrata shirodkar

స్టార్ హీరో మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారి వారి పాట సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు (మే 12) న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇక తెలంగాణాలో బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడంతో హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పడ్డాయి. మహేష్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూశారు.

నమ్రతతో పాటు సర్కారు వారి పాట సినిమా టీం, అనిల్ రావిపూడి కూడా థియేటర్ కి వచ్చారు. ఫ్యాన్స్ హంగామాతో థియేట‌ర్ వ‌ద్ద సంద‌డి వాతావార‌ణం నెల‌కొంది.