Site icon HashtagU Telugu

Sitara:సితార కూచిపూడి నృత్యం…వీడియో పోస్ట్ చేసిన సూపర్ స్టార్..!!

Sitara

Sitara

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు సితార తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సితార తొలి కూచిపూడి డ్యాన్స్ ఇది. శ్రీరామనవమి పర్వదినాన ఈ నృత్య ప్రదర్శనను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్పదనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుందని సితార వీడియోను మహేశ్ పోస్టు చేశారు.

తమ కూతురు సితారకు కూచిపూడి నేర్పించిన వారికి మహేశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సితార చేసిన డ్యాన్స్ పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.