Site icon HashtagU Telugu

Sitara Dance: కళావతి పాటకు సూపర్ స్టార్ కూతురు స్టెప్పులు…!! వీడియో వైరల్…!

Mahesh And Daughter Imresizer

Mahesh And Daughter Imresizer

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ వీడియోస్ తో ఓన్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ స్టార్ కిడ్. ఇప్పుడు లెటెస్టుగా సరికొత్త డ్యాన్స్ వీడియోతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది సీతు పాప.

సితారా ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తిసురేశ్ జంటగా యాక్ట్ చేస్తోన్న మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను పరశురామ్ డైరెక్షన్ లో తెరుకెక్కిస్తుండగా…ఈ సినిమాను జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఈ పాటకు ఇప్పటికే 35మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ పాటకు మహేశ్ కూతురు సితార అదిరే స్టెప్పులేసింది. కమా కమాన్ కళావతి…నువ్వే లేకుండా అదోగతి అంటూ….సేమ్ టు సేమ్ తండ్రిలానే స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను సీతుపాపతన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.