Maharashtra: మ‌హారాష్ట్రంలో జ‌న‌వ‌రి 24 నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం

మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌లో పాఠ‌శాల‌ల‌ను మూసివేశారు.

  • Written By:
  • Publish Date - January 21, 2022 / 08:40 AM IST

మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌లో పాఠ‌శాల‌ల‌ను మూసివేశారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిన తరువాత ఫిబ్రవరి 15 వరకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పాఠశాల విద్యా మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. అయితే నిపుణులతో చర్చించిన తర్వాత ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుంద‌ని దీంతో సోమవారం నుండి పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించిన‌ట్లు వ‌ర్షా గైక్వాడ్ తెలిపారు.

1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను పునఃప్రారంభించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపామ‌ని మంత్రి వ‌ర్షా గైక్వాడ్ తెలిపారు. సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, తేదీని నిర్ణయించే తుది నిర్ణయం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్ వంటి స్థానిక అధికారులదేనని వ‌ర్షా గైక్వాడ్ తెలిపారు. COVID-19కి సంబంధించి స్థానిక పరిస్థితుల ఆధారంగా ఈ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రాష్ట్రంలో కాలేజీలను పునఃప్రారంభించే ప్రతిపాదనను సీఎంకు పంపామని, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ తెలిపారు.

ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి దారితీసినందున ఫిబ్రవరి 15 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే COVID-19 రోగుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రంలోని అంతర్గత ప్రాంతాల నుండి అనేక విద్యాసంస్థ‌లు తరగతులను మూసివేయడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా విద్యా శాఖకు లేఖలు రాసి, పాఠశాలలను మూసివేయడంలో నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించాలని, స్థానిక అధికారులకు నిర్ణయం తీసుకునే హక్కును అనుమతించాలని అభ్యర్థించాయి. దీంతో ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని స‌మీక్షించి పాఠ‌శాల‌ల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.